అమ్మ కావాలి
22-04-21
గురువారం.
తప్పుదారి పడుతుంది.
ఆ అడుగులు సరిచేసే ఒక అమ్మ కావాలి.
మంచి మార్గాన్ని, మంచితనాన్ని పెంచే అమ్మ కావాలి.
మెరుగైన చదువుకు, మెళుకువలు నేర్పించే అమ్మ కావాలి.
కథలతో నీతినిజాయితీ విలువలు బోధించే అమ్మ కావాలి.
ఆప్యాయంగా గోరుముద్దలు తినిపించే అమ్మ కావాలి.
అలిసిన మనసును, ఆవేదన చెందిన మనిషిని ఓదార్చే, మమతలు పంచే అమ్మ కావాలి.
సాయంత్రాలు సరదాగా కబుర్లు చెప్పే అమ్మ కావాలి.
రాత్రి చదువుకు,పాలు అందించి, పలకరించే అమ్మ కావాలి.
అల్లరి చేస్తే, ముద్దుగా మందలించే అమ్మ కావాలి.
నిద్రపోతున్న పిల్లలను, తల నిమురుతూ,చేతిని,ముఖాన్ని తడిమి తడిమి చూసుకుంటూ మురిసిపోయే అమ్మ కావాలి.నూనె రాసి, నిటారుగా పాపిడి తీస్తూ, భవిష్యత్తు , పిల్లల నడక సాఫీగా, పాపిడిలాగా వుండాలని అశ పడుతూ తలదువ్వే అమ్మ కావాలి.నిదుర రాకపోతే, నిదుర పుచ్చే మంత్రం వేసే అమ్మ కావాలి.
ఆటలో,పాటలో తోడుగా వుండే అమ్మ కావాలి.
ఆకలి వేస్తే వున్న వాటితో ఆకలి తీర్చే అమ్మ కావాలి.
దేశం గొప్పతనం, ఎందరో వీరుల త్యాగాలు గుర్తు చేసే అమ్మ కావాలి. తన కష్టంకన్నా, తనవారు తమ కుటుంబం కోసం కష్టపడిన గతాలను జ్ఞాపకంగా చెప్పుకునే అమ్మ కావాలి. సంపదలంటే, శాశ్వతంగా అందరి మనసులో నిలిచిపోయేవి, గొప్పవి. అటు వంటి సంపదలను సంపాదించమని చెప్పే అమ్మ కావాలి.చదువు కన్నా, సంస్కారం విలువను ఇస్తుందని చెప్పే అమ్మ కావాలి.
బాధ్యత అంటే బంధంగా వుండాలని, అలా వుంటూ జీవించే, మార్గదర్శిగా నిలిచే అమ్మ కావాలి.
పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయి అమ్మ అవ్వాలి
అనుకుంటుంది.
అమ్మ అవుతారు చాలామంది.కానీ, అమ్మ అవ్వటం కాదు, అమ్మ కావాలి, మాతృత్వం నిండిన
అమ్మతనంతో అమ్మకావాలి.
ఒక బాధ్యతగల పౌరుడిని తీర్చిదిద్దాలనుకునే వీరమాత అనుకునే అమ్మలు కావాలి. అందమైన,ఆనందమైన జీవితానికి అమ్మ కావాలి.✍️❣️
Comments