ఆగస్టు ఏడు (07/08). స్రవంతి....పేరు మాత్రమే ప్రవాహం కాదు మాట కూడా ప్రవాహమే.తన నవ్వు ఒక ప్రవాహం.తన ప్రేమ ఒక ప్రవాహం. ఎంతో చలాకీగా,సందడిగా అందరినీ ఆట పట్టిస్తూ, అందరూ తన స్నేహితులే,అందరూ తన వారే అనుకునే మంచి మనసున్న అమ్మాయి. ఇంటిలో దేవి అని పిలుస్తాం. ఎందుకంటే,మంగళవారం మూల నక్షత్రంలో పుట్టిందని. పూర్తి పేరు స్రవంతీదేవి. అమ్మ అప్పట్లో కొత్తగా చేస్తున్న కరెంట్ ఆపరేషన్ చేయించుకున్న మూడేళ్లకు, ఆపరేషన్ కుదరక, మూడో సంతానంగా మా దేవి పుట్టింది. మాఅమ్మమ్మకు, అమ్మ,పెద్దమ్మ సంతానం అంతే. మా పెద్దమ్మకు అయిదుగురు ,మేము ముగ్గురం.అందరిలో మా దేవి చిన్నది.అందరు తనని గారంగా చూసుకునేవారు. పన్నెండేళ్ళు వచ్చినా చక్కగా ఎత్తుకుని తిప్పేవారు. మా అందరి కన్నా చిన్నది కావటం వల్ల ఒక వయసు వరకు పొట్టిగానే వుండేది.నాన్నగారు పొట్టి అని పిలవకుండా "ట్టిపో " అనేవారు.తరవాత అదే మా అందరికన్నా పొడుగు అయ్యింది.పేరుకే నేను అక్కను.నా చెల్లి మాత్రం నాకు అమ్మ. నేను ఎప్పుడూ తనకి నోట్లో ముద్ద కలిపి పెట్టిన గుర్తులేదు.అందుకేనేమో, చివరిసారి నేను చేసిన పాయసం తిని వెళ్ళింది. నన్ను చంటిపాప లాగ చూసుకునేది.నేను కాలేజీలో...
ఆత్మీయుడు కృష్ణ పల్లెటూరిలో పెరిగిన అబ్బాయి.డిగ్రీ వరకు పక్కన టౌన్లో చదువుకుని, పట్నంలో P.G.చేసి, ఒక సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కృష్ణకు, ఒక అన్నయ్య, అక్క, తమ్ముడు,చెల్లి వున్నారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగం,అమ్మ గృహిణి. అక్కా,అన్నయ్య, ప్రేమ వివాహాలు చేసుకున్నారు. కృష్ణ, పట్నంలో రూములో చెల్లి,తమ్ముడుతో కలిసి వుండేవాడు. కృష్ణ స్వతహాగా మృదు స్వభావి. కృష్ణ అందరిలో వుంటాడు,అందరికీ ఏ పనిలోనైనా సాయం చేస్తాడు. కృష్ణకు, కాంతు అని ఒక స్నేహితుడు వున్నాడు.కాంతు ఎప్పుడూ చెప్పేవాడు,మంచి సంబంధం చూసి మా కుసుమకు పెళ్ళి చెయ్యాలని,ఒకరోజు సంతోష్ అని కృష్ణ దూరపు చుట్టం మరియు సహాఉద్యోగి. ఇద్దరూ కలిసి కాంతు వాళ్ళ ఇంటికి వెళ్ళారు.సంతోష్‌ని చూసి కాంతు , మా కుసుమను చేసుకుంటాడేమో అడుగు అని కృష్ణకు చెప్పాడు.కృష్ణకు కుసుమంటే ఇష్టం. కానీ, కృష్ణకు తెలుసు, కుసుమకు తాను సరిపోనని,తన ఇష్టాన్ని పక్కన పెట్టి, దగ్గర వుండి పెళ్ళి కుదిర్చి,పెళ్ళికి మాత్రం వెళ్ళలేకపోయాడు. తరవాతరెండు సంవత్సరాలకు కృష్ణ ,ఇంటిలో వాళ్ళు చూసిన సంబంధం చేసుకు...
Comments