ఆత్మీయుడు
ఆత్మీయుడు
కృష్ణ పల్లెటూరిలో పెరిగిన అబ్బాయి.డిగ్రీ వరకు పక్కన టౌన్లో చదువుకుని, పట్నంలో P.G.చేసి, ఒక సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కృష్ణకు, ఒక అన్నయ్య, అక్క, తమ్ముడు,చెల్లి వున్నారు. నాన్న ప్రభుత్వ ఉద్యోగం,అమ్మ గృహిణి. అక్కా,అన్నయ్య, ప్రేమ వివాహాలు చేసుకున్నారు.
కృష్ణ, పట్నంలో రూములో చెల్లి,తమ్ముడుతో కలిసి వుండేవాడు. కృష్ణ స్వతహాగా మృదు స్వభావి. కృష్ణ అందరిలో వుంటాడు,అందరికీ ఏ పనిలోనైనా సాయం చేస్తాడు. కృష్ణకు, కాంతు అని ఒక స్నేహితుడు వున్నాడు.కాంతు ఎప్పుడూ చెప్పేవాడు,మంచి సంబంధం చూసి మా కుసుమకు పెళ్ళి చెయ్యాలని,ఒకరోజు సంతోష్ అని కృష్ణ దూరపు చుట్టం మరియు సహాఉద్యోగి. ఇద్దరూ కలిసి కాంతు వాళ్ళ ఇంటికి వెళ్ళారు.సంతోష్ని చూసి కాంతు , మా కుసుమను చేసుకుంటాడేమో అడుగు అని కృష్ణకు చెప్పాడు.కృష్ణకు కుసుమంటే ఇష్టం. కానీ, కృష్ణకు తెలుసు, కుసుమకు తాను సరిపోనని,తన ఇష్టాన్ని పక్కన పెట్టి, దగ్గర వుండి పెళ్ళి కుదిర్చి,పెళ్ళికి మాత్రం వెళ్ళలేకపోయాడు. తరవాతరెండు సంవత్సరాలకు కృష్ణ ,ఇంటిలో వాళ్ళు చూసిన సంబంధం చేసుకున్నాడు.పెళ్లయ్యాక, కాంతువాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. కుసుమ కూడా కలిసేది. అందరూ చాలా అనందంగా కలిసేవారు.కాంతుకు పెళ్ళి అయ్యింది.అందరూ కలిసి సరదాగా గడిపేవారు.
కాంతు వాళ్ళ అమ్మగారు కృష్ణని కూడా అల్లుడు లాగే చూసేది,పిలిచేది. అల్లుడుగారి బంధువు, కాంతుకు స్నేహితుడు .రెండు విధాలుగా దగ్గరివాడు, అందరినీ మర్యాదగా చూసుకునే గుణం కృష్ణది.ఇలా వుండగా! కృష్ణ చెల్లి, ఒక అబ్బాయిని ప్రేమించింది.కృష్ణ వాళ్ళ ఇంటిలో ఎవ్వరూ ఒప్పుకోలేదు. కానీ, ప్రేమ విలువ,ప్రేమ దక్కకపోతే పడే బాధ తనకి తెలుసు కాబట్టి, కృష్ణ దగ్గర వుండి,చెల్లికి పెళ్ళిచేసాడు.కుసుమను,కాంతును,
సంతోషును పెళ్ళికి పిలిచాడు.కుసుమ మనసులో ఆ రోజు కృష్ణ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. తన పెళ్ళి చేశాడు అనే ఒక కృతజ్ఞత.చెల్లి పెళ్ళి చేసి, అత్తారింటికి సాగనంపుతూ కృష్ణ పడిన బాధ, కుసుమకు ఎప్పుడు గుర్తొచ్చినా,కళ్ళ నీళ్ళు తిరిగేవి. ఏ చిన్న అవసరమైనా,చెల్లికి కృష్ణ అండ.అన్నయ్యకు చేదోడు వాదోడుగా వుంటాడు. కృష్ణకు ఇద్దరు పిల్లలు,తన చెల్లికి ఇద్దరు పిల్లలు ఎవరి ఆధారం లేదు.ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు.చెల్లి అడిగింది కాదు,లేదు,కుదరదు,నేను చెయ్యలేను, అనే మాట ఎప్పుడూ చెప్పడు. చెల్లి సొంత ఇల్లు కొనుకున్నా, వాళ్ళ భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటున్నా, కృష్ణని అడిగితే, ఇవ్వటమే తెలుసు. తన భార్యకు అమ్మగారి ఇంటి నుంచి అడిగి తెచ్చుకోమని చెప్పడు.ఒక్క ఉద్యోగంతోనే ఖర్చులన్నీ పెడతాడు.సొంతగా ఇల్లు కొనుకునే స్థోమత వున్నా,సొంత ఇల్లులేదు.
స్నేహితుడు,చుట్టాలు అని బేదం వుండదు.
అడిగినవారికి డబ్బు సాయం చేస్తూ వుంటాడు. ఇంక పనిలో పడితే, ఇల్లు గుర్తువుండనే వుండదు. బాగా చదువుకున్నాడు.చదువుకుంటే మంచిగా స్థిరపడవచ్చు అని మాత్రం నమ్ముతాడు. మళ్ళీ పై చదువులు చదవాలని నిర్ణయం తీసుకున్నాడు.ఒక మంచి విశ్వ విద్యాలయంలో సీట్ వచ్చింది ,అక్కడకి పిల్లలు,భార్యను తీసుకుని సగం జీతంతో ఐదు సంవత్సరాలు కష్టపడి, డాక్టరేట్ పట్టా పొందాడు.
కృష్ణ మొహంలో చిరునవ్వు, ఆత్మీయమైన పలకరింపు,
మర్యాదలు,స్వార్థం లేని మనస్తత్వం , బంధాలను బాధ్యతగా ,విలువలను కోల్పోకుండా బ్రతకటం, అందరినీ
కలుపుకుంటూ, చిన్నవాళ్ళని అర్ధం చేసుకుంటూ, పెద్దవాళ్ళని గౌరవిస్తూ, పనిలో శ్రద్ధ వహిస్తూ, కుటుంబానికి
విలువనిస్తూ హాయిగా బ్రతుకుతున్నాడు.
( ఇది కథ కాదు, ఒకరి జీవన విధానం..
కొన్ని మాత్రమే కల్పితం.)
నేటి సమాజానికి ఇలాంటి ఆత్మీయులు ఎంతో అవసరం.✍️
Comments