ఆ( తరం) నాయకుడు
ఆ ( తరం) నాయకుడు
M.P గా బాధ్యతలు చేపట్టి,సాధారణ జీవనం సాగిస్తున్న
శ్రీ కమ్ముల బాలసుబ్బారావుగారు గురించి
పంచుకుంటున్నాను.అయన గురించి చెప్పాలంటే ముందువారి ఇంటి గురించి చెప్పాలి.
ఎం.పిగా చేసినా, ఒక మామూలు పెంకుటిల్లులోనే వుండేవారు.లోపలకి వెళ్తుంటేనే, కార్యకర్తలు చాలా నిశ్శబ్దంగా వేచి చూస్తూ వుండేవారు. గడప లోపలకు
అడుగు పెడుతుంటే, ఆ గదిలో అంతా తెల్లని పరుపులు
వేసి వుండేవి. అందరితో కలిసి అక్కడే కూర్చుని
మాట్లాడేవారు. వారి ఇంటిలో తేనీరు ఇప్పటికీ నేను మరిచిపోలేను. ఎంతమంది వచ్చినా,ఎవరు వచ్చినా, అల్లం లేక నిమ్మ తేనీరు ఇచ్చేవారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం,ఎంతో స్వచ్ఛమైన మాటలు. ఎంపీ గా చేసినప్పుడు రెండు కోట్లు నిధులు కేంద్రం మంజూరు చేశారు.ఒక్క రూపాయి కూడా అవకతవలు కాకుండా,
సక్రమంగా కేటాయించిన పని పూర్తి చేశారు. ఈ మాటలు మా నాన్నగారు మాటల్లో నేను విన్నవి. మా నాన్నగారు
ఏ జిల్లాలో పని చేసినా, ఆ జిల్లా కలెక్టర్ కూడా నాన్నగారిని గౌరవించేవారు.అలాంటిది నాన్నగారు, బాలసుబ్బారావు గారిని ఎంతో గౌరవించేవారు. (ఎలా అంటే పెద్ద రాయుడు సినిమాలో మోహన్ బాబు దగ్గర కైకాల సత్యనారాయణ గారు వచ్చి గౌరవం ఇచ్చేవారు అలా). మా ఇంటిలో
గ్లాసుతో నీళ్ళు ముంచుకోవడం కూడా నాన్నగారికి తెలియదు. బాలసుబ్బారావుగారు మాఇంటికి వచ్చినప్పుడు, ప్రతి చిన్నది నాన్నగారే చేసేవారు.
అమ్మతో చెప్పేవారు.నా గురించి ఏమి చెప్పకు.అని భయపడే వారు.ఆయన అంటే అంత భయం,భక్తి.
బాల సుబ్బారావు గారు నిజాయితీ,నిస్వార్థం,ప్రజాసేవ మా అందరికీ ఎంతో ఆదర్శంగా కనిపించేవారు. బాల సుబ్బారావుగారు ,పి.వి. నరసింహారావుగారి అనుచరుడు,శిష్యుడు. నేను పి.వి.గారిని చూడలేదు కాని, బాల సుబ్బారావు గారిని చూసిన అనుభవంతో అనిపిస్తుంది.పి.వి.గారు కూడా ఇంతకన్నా వెయ్యి రెట్లు
నిస్వార్థం,నిజాయితీ గలవారు అని. మా పెళ్ళికి , మా నాన్నగారు చనిపోయి నాలుగేళ్లు అయ్యింది. అమ్మ ,అన్నయ్య వెళ్ళి బాల సుబ్బారావు గారిని పిలిచారు.
ఆయన రాత్రి పెళ్ళి అయితే ఆ రోజు సాయంత్రం వచ్చారు.
అర్ధరాత్రి పెళ్ళి అయినా, మా నాన్నగారు లేరని,మీకు మేము వున్నామనే ధైర్యాన్ని,ఆనందాన్ని ఇవ్వటానికి అరవై ఏళ్ళు పైన వయసు వున్నా, పెళ్ళి అయ్యేవరకు పెళ్ళి పెద్దగా అలాగే కూర్చుని పెళ్ళి చేసారు.మాకు బంధుత్వం లేదు, స్నేహితులం కాము. మా నాన్నగారు గురువుగారు అని భావించి ఆయన సలహాలు,సూచనలు తీసుకునేవారు. ఇలాంటి రాజకీయ నాయకులు
ఆతరం లో ఎందరో వుండేవారు.వాళ్ళని చూసి నేర్చుకున్న నేటి తరం యువకులు వున్నారు.కానీ,నేటి తరంలో ఇలాంటి రాజకీయ నాయకులు కరువైయ్యారు.
పి.వి.గారు పుట్టినరోజు సందర్భంగా నాకు పరిచయం వున్న మహోన్నత వ్యక్తి జీవితం మీతో పంచుకోవాలని ఇలా పంచుకున్నాను. 🙏🏻✍️
Comments