చల్లని వేసవి

చల్లని వేసవి ఏప్రిల్26,2022. అది మేనెల, హైదరాబాదులో సూర్యడుగారు తన శక్తిమేరకు పని చేస్తున్నారు. పిల్లలకు సెలవులు ఇచ్చి నెల దాటేసింది. అల్లరిలో సూర్యుడిగారితో పోటీ పడుతున్నారు. ఊరు మారితే గానీ ,తీరు మారదు అనట్టు, నాలుగు రోజులు ఎటైనా వెళ్తేగానీ, ఇంటా,బయట వాతావరణాన్ని తట్టుకోలేమనిపించింది.చల్లని ప్రదేశాలకు వెళ్దామనే ఆలోచన వచ్చింది.ఆలోచన వచ్చిందే తడవుగా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి,ఏం చూడాలని అన్నయ్య రూట్ మ్యాప్ వేశాడు. రెండు రోజుల తరవాత, ఉదయం కడుపును ఇడ్లీ, దోశలతో నింపేసి, కారు డిక్కిని బ్యాగ్స్ తో నింపేసి, పదకొండు గంటలకు కారు బెంగళూరు వెళ్ళే రోడ్డు ఎక్కింది. అలా కార్లో పాటలు,మాటలు,సరదాగా ఆటలు(జ్ఞాపశక్తితో ఆడేవి)రెండు గంటలు పైనే ప్రయాణం సాగింది. మధ్యాహ్నం ఒంటి గంటన్నర కావొస్తోంది. ఆట పాటలకు ఇడ్లీ,దోశలు అరిగిపోయి ఆత్మారాముడుగోల మొ...